VIDEO: కాలనీలకు మౌలిక సదుపాయాల కరువు
SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో రోడ్లు, కాలువలు లేకపోవడంతో ఇండ్లలో ఉపయోగించే మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గడ్డి ఎక్కువగా రోడ్డుపై పెరగడంతో రాత్రి సమయంలో పాముల అధికంగా వస్తున్నాయన్నారు.