విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ
WNP: మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని గురువారం ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.