పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి: డాక్టర్ నరేష్

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి: డాక్టర్ నరేష్

SRPT: పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ ఆకుల నరేష్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం అన్నారంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. గ్రామంలో 31 తెల్ల పశువులకు, 73 నల్ల పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు.