VIDEO: అపరిశుభ్రంగా బెల్లంపల్లి RTC బస్టాండ్
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని RTC బస్టాండు పరిశుభ్రం చేయక చెత్తా చెదారంతో నిండిపోయింది. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లు, మంచినీటి వసతి సరిగ్గా లేవని ప్రయాణికులు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా శుభ్రం చేయకపోవడంతో పాకురు పట్టి అధ్వానంగా ఉందని ఆగ్రహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు.