ఎన్నికలపై కలెక్టర్‌తో సాధారణ పరిశీలకుల భేటీ
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో ఇవాళ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు,TGMSIDC ఎండీ ఫణీంద్ర రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ నిర్వహణకు చేపడుతున్న ముందస్తు చర్యల పై వివరంగా చర్చించారు. జిల్లాలో ఎలక్షన్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.