బాంబుదాడికి యత్నం.. యూఎస్ పౌరుడు అరెస్టు

గత వారం ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లోని US మిషన్‌పై బాంబుదాడికి యత్నించిన జోసెఫ్ నెయ్‌మార్‌ను ఆ దేశ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అమెరికాకు విమానంలో తరలించారు. విమానం దిగగానే అతడిని US అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా కూడా జోసెఫ్ హత్య బెదిరింపునకు దిగినట్లు గుర్తించారు.