'డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జోగి రమేష్ అరెస్టు'
VZM: కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జోగి రమేష్‌ను అరెస్టు చేశారని రాజాం వైసీపీ ఇంఛార్జ్ తలే రాజేష్ విమర్శించారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నకిలీ మద్యం బయటపడిన తర్వాత జరిపిన విచారణ, తీసుకున్న చర్యలను ప్రజలకి చంద్రబాబు చెప్పాలి పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.