చిలకలూరిపేటలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
PLD: చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై చెన్నకేశవులు మాట్లాడుతూ.. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. సరైన పత్రాలు లేని 11 వాహనాలకు రూ. 2,035 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని హెచ్చరించారు.