ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్యోగుల ఆందోళన

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్యోగుల ఆందోళన

JGL: ధర్మపురి ప్రభుత్వాసుపత్రి వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్లు వంటి విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు గత 7–8 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.