'అక్కినేని ఫ్యాన్స్ ఆర్థిక సహాయం'

NDL: నంది కోట్కూరు మున్సిపాలిటీ 1వ వార్డులో అక్కినేని నాగార్జున వీరాభీమాని కానుగల అశోక్ (39) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్ అశోక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అశోక్ కుటుంబాని పరామర్శించి, దహానసంస్కరాలకు ఆర్థిక సహాయం రూ. 5 వేలు అందజేశారు.