కాళోజి నారాయణరావుకు ఘన నివాళి

MDK: తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని రామాయంపేట తహశీల్దార్ రజనీకుమారి అన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.