ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

KDP: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. సోమవారం కడప నగరంలోని 21 డివిజన్ పరిధిలోని సున్నపురాళ్లపల్లెలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎమ్మెల్యే, ప్రజలకు వివరించారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.