అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎమ్మార్వో

VZM: కొత్తవలస కోటపాడు రోడ్డులో ఉన్న మోదమాంభ ఆగ్రో సీడ్స్‌ను మండల తహసీల్దార్ అప్పలరాజు, ఎస్సై ప్రసాదరావు, వ్యవసాయ అధికారి రాంప్రసాద్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్ చేయకూడదని సూచించారు.