శ్రీశైల మల్లన్నకు TG మంత్రి ప్రత్యేక పూజలు
NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని బుధవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.