నేడు బీజేపీ 'గోదావరి వంతెన పోరు'
MNCL: మంచిర్యాల-అంతర్గాం అనుసంధానంగా గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో గోదావరి వంతెన పోరు కార్యక్రమం నిర్వహించినున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. స్థానిక ఐబీ చౌరస్తాలో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయనుండగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొంటారని పేర్కొన్నారు.