నేడు మల్కాపురంలో జోనల్ కమిషనర్ పర్యటన
VSP: విశాఖలో ఈనెల 14 నుంచి జరిగే మిలాన్–నేవీ విన్యాసాల నేపథ్యంలో, సింధియా నుంచి మల్కాపురం వరకు పారిశుద్ధ్య బాధ్యతలను జోనల్ కమిషనర్ హేమలతకు అప్పగించారు. బుధవారం ఆమె మల్కాపురం ప్రాంతంలో పర్యటించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేశ్, సూపర్‌వైజర్ వెంకటేశ్వరరావు, మెడికల్ ఆఫీసర్ రామకృష్ణ పాల్గొన్నారు.