నగరంలో తేలికపాటి వర్షాలు

నగరంలో తేలికపాటి వర్షాలు

HYD: నగరంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. ఉదయం అంతా ఎండ, ఉక్కపోత వాతావరణం ఉండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, షేక్‌పేట్‌ వంటి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. క్యుమిలో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు.