'ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంటు వితరణ'
SDPT: మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త లింగాల వెంకటేష్ మరోసారి మానవత్వం, సేవాస్పూర్తికి నిదర్శనంగా నిలిచాడు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంట్ బస్తాలు సోమవారం రోజున అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభ దశలో ప్రతి లబ్ధిదారునికి 15 సిమెంట్ బస్తాలు ఇవ్వగా, స్లాబ్ దశలో మరిన్ని బస్తాలు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.