25, 26 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

గుంటూరు: ఈ నెల 25, 26వ తేదీల్లో గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని గుంటూరు కమిషనర్ కీర్తి శుక్రవారం తెలిపారు. పైపులకు మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో గుంటూరువారితోట, నాజ్ సెంటర్, పొత్తూరివారి తోట, కొత్తపేట,తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 26వ తేదీ సాయంత్రం నుంచి తాగునీరు తిరిగి సరఫరా జరుగుతుందన్నారు.