లైన్స్ క్లబ్ అధ్యక్షుడుగా రమేష్ ఎన్నిక

KMM: కల్లూరు మండలం నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రీజినల్ ఛైర్మన్ నాగేష్ ఆధ్వర్యంలో జరిగిన నూతన కమిటీ ఎన్నికలలో సెక్రటరీగా ఆనందరావు, ట్రెజరర్‌గా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్‌గా రాయల్ మురళీధర్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులను శాలువాలతో సన్మానించారు.