TRP పార్టీలో చేరిన పలు పార్టీల నేతలు
జయశంకర్ భూపాలపల్లి పట్టణ కేంద్రానికి చెందిన పలు పార్టీల నేతలు టీఆర్పీ పార్టీ రాష్ట్ర నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2028లో రానున్నది టీఆర్పీ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి నుంచి టీఆర్పీ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించాలన్నారు.