పాదగయలో పూజ ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈ నెల 22న నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మి వ్రత పూజలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పరిశీలించారు. ఆలయాన్ని సందర్శించి పూజలకు సంబంధించి ఏర్పాట్ల గురించి ఈవో జగన్ మోహన్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.