మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

పశ్చిమ ఆసియాలో మారుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన త్వరలో అత్యున్నత స్థాయి భేటీ జరగనుంది. ప్రధాని ఢిల్లీ చేరుకున్న వెంటనే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల రక్షణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.