పెదపాలెంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పల్నాడు: అచ్చంపేట మండలం పెదపాలెంలో రూ.30 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రోడ్లు, స్కూల్ భవనం, గోకులం షెడ్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.