ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పాల్గొన్నారు.