గార్మెంట్స్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర మండలంలోని ఇండియన్ గార్మెంట్స్ ఫ్యాక్టరీని సినీ హీరో మంచు మనోజ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సందర్శించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతు, కార్మిక, యువజన శ్రేయస్సే తన కర్తవ్యమని స్పష్టం చేశారు.