ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫలోడి-బికనీర్ హైవేపై ఆగి ఉన్న టెంపోను వేగంగా వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.