జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక
KMM: తెలంగాణ తరపున జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీలలో పాల్గొనేందుకు ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి చెన్నై (తమిళనాడు) వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మకమైన 'జాతీయ స్కూల్ గేమ్స్' లో వీరు తమ ప్రతిభను చాటానున్నారు. ఎంపికైన క్రీడాకారులను గురువారం జిల్లా క్రీడా శాఖ అధికారులు అభినందించారు.