భారీ ధర పలికిన వినాయక లడ్డు

శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామం గొలివి వీధిలో వినాయక లడ్డు వేలం పాటను కమిటీ సభ్యులు గురువారం నిర్వహించారు. ఈ వేలం పాటలో అదే గ్రామానికి చెందిన బటాన కుటుంబ సభ్యులు వినాయక లడ్డూను రూ.33 వేలకు దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది లడ్డూ వేలం పాటలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కమిటీ సభ్యులు తెలిపారు.