కంపు కొడుతున్న డ్రైనేజీ కాలువలు

ప్రకాశం: మార్కాపురంలోని డ్రైనేజీ కాలువలు కంపు కొడుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని దోర్నాల బస్టాండ్ దగ్గరలో ఉన్న ప్రధాన కాలువ మండపం దగ్గర డ్రైనేజీ మొత్తం పేరుకుపోయి దుర్గంధం కొడుతుందని ప్రయాణికులు, స్థానిక ప్రజలు తెలియజేశారు. స్థానికులు మాట్లాడుతూ.. ప్రధాన కాలువలే ఇంత వ్యర్ధాలతో ఉండిపోతే సందుల్లో పరిస్థితి మారి దారుణంగా ఉందని పేర్కొన్నారు.