పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలి: సీపీఎం

విశాఖ: నేటినుంచి డైరీ పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సీపీఎం పార్టీ లేఖ విడుదల చేసింది. పెంచిన పాల ధరల వల్ల ప్రజలపై ఆరు రూ. కోట్ల భారం పడుతుందని ఆ లేఖలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం కలుగజేసుకొని పాల ధరలను తగ్గించేలా చూడాలని కోరింది. ప్రతి నెల రైతులకు పాల సేకరణకై మూడు వేల రూపాయలు యాజమాన్యం చెల్లిస్తుందని ఆరోపించింది.