కళాశాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
SRCL: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులతో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్‌సీ, బీకాం, బీఏ, తదితర కోర్సుల వివరాలతో సిద్ధం చేసిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి విడుదల చేశారు.