టీబీ నివారణపై అవగాహన సదస్సు

కోనసీమ: ఆలమూరు మండలం చింతలూరులో శుక్రవారం టీబీ ముక్త భారత్ అభియాన్ ఇన్సెంటివ్ టీబీ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా. సాయికుమార్, టీబీ యూనిట్ సిబ్బంది పాల్గొని క్షయ వ్యాధి పట్ల అపోహలు పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.