VIDEO: కోటవురట్లలో ట్రాఫిక్ అంతరాయం
AKP: మండల కేంద్రమైన కోటవురట్లలో ఇవాళ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలను తీసుకువెళ్లే బస్సులు ఒకేసారి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు పక్కనుంచి సైడ్ రూట్‌లో వెళ్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వచ్చే పోయే వాహనాలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.