రోళ్లలో ఇద్దరు వీఆర్వోల సస్పెండ్
సత్యసాయి: రోళ్లలో ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. తహసీల్దార్ షేక్షావలి వివరాల మేరకు.. ఇద్దరు వీఆర్వోలు విధుల సమయంలో మద్యం తాగి ప్రజలపై వీరంగం సృష్టించడం సోషల్ మీడియా వైరల్ కావడంతో విచారించి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. విధుల్లో ఎవరైనా అలసత్వం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు.