సిమెంట్ ట్యాంకర్ బోల్తా.. ట్రాఫిక్ SLOW

సిమెంట్ ట్యాంకర్ బోల్తా.. ట్రాఫిక్ SLOW

RR: చేవెళ్ల నుంచి శంకర్ పల్లి రోడ్డు మార్గంలో ఎల్వర్తి గ్రామంలోని దుర్గామాత ఆలయం సమీపంలో ఓ సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. వాహనదారులు సహకరించాలని కోరారు.