'ప్రజా ప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది'
NLG: ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.