ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

కోనసీమ: అల్లవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు మండల అభివృద్ధి అధికారి బి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లవరం ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ రాజ్ శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని అటువంటి ఈ రోజున పంచాయతీ దినోత్సవం జరుపుకోవడం సంతోషాన్నిస్తుందని అన్నారు.