జగిత్యాలలో బీసీ బంద్ ప్రశాంతం

జగిత్యాలలో  బీసీ బంద్ ప్రశాంతం

జగిత్యాల: బీసీ రిజర్వేష్లపై బీసీ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి..పెట్రోలు బంకులు, దుకాణాలు, పాఠశాలలు మూసివేశారు.