ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నా: సీఎం

ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నా: సీఎం

AP: సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటన నిమిత్తం సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. 'లండన్ చేరుకున్న మాకు ఇక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. ఈనెల 4న ప్రతిష్టాత్మక సంస్థ IOD నుంచి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాను' అని పేర్కొన్నారు.