కొడంగల్ శివారులో రోడ్డు ప్రమాదం

కొడంగల్ శివారులో రోడ్డు ప్రమాదం

VKB: కొడంగల్ పట్టణ శివారులోని రేగడి మైలారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బోరు మెకానిక్ ఈశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.