పులివెందుల ఎస్సై-2గా మధుసూదన్ రెడ్డి
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్సై-2గా ఎం. మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. రెండు నెలలుగా అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2 పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కడప వీఆర్లో ఉన్న ఎం. మధుసూదన్ రెడ్డిని పులివెందుల ఎ-2గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు.