'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాలో భారీ వర్షం

'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాలో భారీ వర్షం

TPT: దిత్వా తుఫాన్ ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచి  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వీధులు జలమయమయ్యాయి. వాతావరణం పూర్తిగా చల్లబడి, చలి తీవ్రత పెరిగింది. ఇప్పటికే మండలంలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పూర్తిగా నిండుకుండలా మారాయి. ప్రవహించే కాలువల వైపు వెళ్లొద్దని కలెక్టర్, అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.