తాళ్ల రాంపూర్‌లో సెక్షన్ 163 అమలు

NZB: ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు, గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఏర్పడడంతో ఎస్సై పడాల రాజేశ్వర్ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జె. మల్లయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు గ్రామంలో BNSS సెక్షన్ 163 అమల్లో ఉంటుందనన్నారు.