రాజేంద్రప్రసాద్ వీడియోపై స్పందించిన విశాల్
లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పడంపై నటుడు విశాల్ స్పందించాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తిని మన్నించి మీరు క్షమాపణలు చెప్పడం మీ గొప్పతనానికి నిదర్శనం' అని విశాల్ పేర్కొన్నాడు. ఈ పరిణామంతో గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది.