తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి

తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి

TPT: అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఐదేళ్ల పాప తప్పిపోయి కలకలం రేపింది. బస్సు తనిఖీ కోసం పెద్దలు దిగిన సమయంలో పాప బస్సులోనే నిద్రపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు లేకుండానే వాహనం తిరుమలకు చేరుకుంది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనచెందగా, ఆర్టీసీ అధికారులు టిక్కెట్ల ఆధారంగా బస్సు నంబర్ గుర్తించి పాపను తిరుమలో తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.