పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

SKLM: శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న 'నీట్' పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు చూసి పోలీస్ అధికారులు సిబ్బందికి విధి నిర్వహణలపై పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలైన పాలిటెక్నిక్ కళాశాల, అర్జీయూ కేటీ క్యాంపస్, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలను ఎస్పీ సందర్శించారు.