పోలీసుల కార్డాన్ సెర్చ్: 42 వాహనాల సీజ్..!
PLD: జిల్లాలోని ఎలమంద గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా చేపట్టిన ఈ సోదాల్లో.. సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు పదునైన ఆయుధాలను సీజ్ చేశారు. చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో భారీగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.