ఉపాధి హామీ పనుల్లో సాంకేతిక సమస్యలు
ADB: నార్నూర్ మండలంలోని జామడ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులకు హాజరవుతున్నప్పటికీ, యాప్‌లో ఫొటోలు క్యాప్చర్ కాకపోవడంతో హాజరు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమకు కూలీ రాకుండా నష్టం జరుగుతోందని సర్పంచ్ చందరా, ఎఫ్ఎ గోపాల్ తెలిపారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించి తమను ఆదుకోవాలన్నారు.