జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
MBNR: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా దేవరకద్ర, కొత్తమొల్గరలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహమ్మదాబాద్, కోత్తపల్లి 42.1°C, చిన్నచింతకుంట, సల్కర్ పేట 42.0°C, దోనూర్, సేరివెంకటాపూర్ 41.9°C, అడ్డకల్, జడ్చర్ల 41.7°C, నవాబ్ పేట 41.6, కొల్లూరు 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.